ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాల వ్యాన్​ ఢీకొని ఇద్దరు పాదచారులు మృతి - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

పొలం పనులను ముగించుకుని ఇంటికి నడిచి వెళ్తున్న అన్నదమ్ములను పాల వ్యాన్​ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలోని అమ్మాయిపల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

milk van hits two members died
పాలవ్యాను ఢీకొని ఇద్దరు పాదచారులు మృతి

By

Published : Mar 15, 2021, 8:05 PM IST

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి వద్ద పాలవ్యాను ఢీకొని ఇద్దరు మృతి చెందారు. అమ్మాయిపల్లికి చెందిన సాయి రెడ్డి, రాజశేఖర్​రెడ్డి అన్నదమ్ములు. ఇద్దరు కలిసి ఉదయం పొలం వద్దకు వెళ్లి అక్కడ పనులను ముగించుకుని ఇంటికి నడిచి వెళ్తుండగా.. గ్రామశివారులో పాలను తీసుకెళ్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాయక్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details