ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసత్యాలతో అన్నదాతలను మోసం చేస్తున్నారని.. తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. "23 నెలల్లో రైతులకు రూ.68 వేల కోట్ల పైచిలుకు సాయం అందించామని సీఎం ప్రకటించటం అబద్ధం. రైతు భరోసా కింద ఇచ్చామని చెప్తున్న రూ.20 వేల కోట్లలో 40 శాతం కేంద్రం ఇచ్చింది. సున్నా వడ్డీ పథకం ఏ రైతుకూ అమలు కాలేదు. బీమా చెల్లింపులూ తానే చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసి ఇచ్చిన మొత్తాన్ని కూడా సాయంగా చెప్పుకుంటున్నారు.' అని మర్రెడ్డి విమర్శించారు.
అసత్యాలతో అన్నదాతలను మోసం చేస్తున్నారు: మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి
సీఎం జగన్పై తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అసత్యాలతో రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏ రైతు సున్నా వడ్డీ పథకం కింద లబ్ధి పొందలేదని పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న సాయాన్నీ తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆక్షేపించారు.
మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి