మావోయిస్టు గడ్డం మధుకర్ గుండెపోటుతో మృతి చెందాడు. కరోనా చికిత్స కోసం వచ్చిన మధుకర్‌ను ఈనెల 2న పోలీసులు పట్టుకున్నారు. అనంతరం చికిత్స అందించేందుకు ఉస్మానియాకు తరలించారు. కొవిడ్‌కు చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున అతను మృతి చెందాడు.
గుండెపోటుతో మావోయిస్టు గడ్డం మధుకర్ మృతి
మావోయిస్టు గడ్డం మధుకర్ గుండెపోటుతో మృతి చెందాడు. కరోనా చికిత్స కోసం వచ్చిన అతన్ని తెలంగాణలోని వరంగల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ ఉస్మానియాలో కొవిడ్‌కు చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. మధుకర్ మృతదేహాన్ని పోలీసులు స్వస్థలానికి తరలించారు.
maoist madhukar died of heart attack
కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన గడ్డం మధుకర్ 22 ఏళ్ల క్రితం పీపుల్స్ వార్‌లో చేరాడు. ప్రస్తుతం అతను దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాడు. మధుకర్ మరణం గురించి అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని స్వస్థలం కొండపల్లికి తరలించారు.
ఇదీ చదవండి :Dhulipalla Narendra: తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు