ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముందే విచ్చేస్తున్న ఫలరాజు... లాభాల ఆశల్లో రైతురాజు - mango fruit

ఫల రారాజు... మామిడి వచ్చేస్తోంది. పుష్కలంగా కురిసిన వర్షాలు, అనుకూల వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది సీజన్‌ కంటే ముందుగానే మార్కెట్లకు మామిడి రాక ప్రారంభమైంది. ఈ సారి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు. మార్చి మొదటి వారం నుంచి కొనుగోళ్లు ఊపందుకోనున్న దృష్ట్యా... అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.

mango
ముందే విచ్చేస్తోన్న ఫలరాజు... లాభాల ఆశల్లో రైతురాజు

By

Published : Feb 20, 2021, 7:48 AM IST

ముందే విచ్చేస్తోన్న ఫలరాజు... లాభాల ఆశల్లో రైతురాజు

మామిడి సీజన్‌ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే మార్కెట్లకు మామిడి రాక ప్రారంభం కాగా... టోకు, చిల్లర అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సాగు తొందరగా రావడంతో జనవరి మొదటి వారంలోనే మార్కెట్లకు మామిడి రాక మొదలైంది. ఎండలు మొదలుకాక ముందే తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు తరలివస్తున్నాయి. తెలంగాణలో చెట్లన్నీ పూత, పిందె దశల్లో ఉండగా... అనంతపురం, పాలమూరు వంటి జిల్లాల నుంచి కొద్ది పరిమాణంలో మామిడి మార్కెట్లకు చేరుతోంది. రోజూ 25 నుంచి 100 క్వింటాళ్ల వరకు రైతులు కాయలు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 20 కిలోలు 1500 నుంచి 1600 వరకు పలుకుతోంది. ఈసారి సీజన్‌ బాగుందని రైతులకూ లాభదాయకంగానే ఉంటుందని వ్యాపారుల ఆశాభావం వ్యక్తం చేశారు.

సమృద్ధిగా కురిసిన వర్షాలు, అనుకూల వాతావరణ పరిస్థితులతో మామిడి సీజన్‌పై రైతులు, వ్యాపారుల ఆశాజనకంగా ఉన్నారు. తోటల్లో పూత, పిందెలు, కాయలను చూసి రైతులు మురిసిపోతున్నారు. గతేడాది కరోనాతో తీవ్రంగా నష్టపోయారు. అతిపెద్ద పండ్ల మార్కెట్‌ గడ్డిఅన్నారం మార్కెట్‌ను తాత్కాలికంగా కోహెడలో ఏర్పాటు చేస్తి...గాలివాన దెబ్బతీసింది. ఈ సారి మామిడి సీజన్, రైతులు, వాహనాలు రద్దీ దృష్టిలో పెట్టుకుని గడ్డిఅన్నారం మార్కెట్‌లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరగా ఏర్పాట్లు పూర్తిచేయాలని కోరుతున్న వ్యాపారులు...ఎవరికీ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడాలని కోరుతున్నారు.

రెండేళ్లపాటు గడ్డిఅన్నారంలోనే పండ్ల మార్కెట్‌ కొనసాగించనున్న దృష్ట్యా....మార్కెట్‌ కమిటీ సిద్ధమవుతోంది. ఇప్పటికే 40 మంది ప్రైవేటు సిబ్బందిని నియమించారు. ప్రవేశ ద్వారం వద్ద అదనంగా మరో రెండు వేబ్రిడ్జిలు, లోపల ఎలక్ట్రానిక్ యంత్రాలు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర, సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బందులూ రానివ్వబోమని మార్కెట్‌ కమిటీ చెబుతోంది. కమీషన్‌ ఏజెంట్లు అన్యాయానికి పాల్పడితే ఉపేక్షించబోమని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ హెచ్చరించారు.

మార్కెట్‌లో రైతుల సౌకర్యార్థం... తాగు నీరు, విశ్రాంతి గదులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి:

చంద్రగిరి ఓటర్లకు... తిరుమల శ్రీవారి ప్రసాదం!

ABOUT THE AUTHOR

...view details