Man Hit by Train: నేటి తరానికి ఏ పని చేసినా చేతిలో మొబైల్‌ఫోన్, చెవిలో ఇయర్‌ఫోన్స్ ఉండాల్సిందే. ముఖ్యంగా ప్రయాణాల్లో ఇవి అత్యంత అవసరమైనవిగా మారాయి. వాహనాలు నడపిటప్పుడు, రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా చెవిలో పాటలు మోగాల్సిందే. ఇలాగే ఓ వ్యక్తి చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఫుల్ సౌండ్‌లో పాటలు వింటూ ఉత్సాహంగా వెళ్తున్నాడు. మార్గ మధ్యలో వచ్చిన రైల్వే లైన్‌ను దాటుతున్నాడు. హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటుండటం వల్ల అటువైపు నుంచి వస్తున్న రైలు శబ్ధం వినలేదు. మ్యూజిక్ వినడంలో లీనమవడం వల్ల కనీసం చుట్టుపక్కల ఏమవుతుందో గమనించనూ లేదు. అంతే ఇంకేముందు. వేగంగా వస్తోన్న రైలు ఆ యువకుణ్ని గుద్దేసి వెళ్లిపోయింది.
Man Hit by Train in Mahbubnagar: పాటే ప్రాణం తీసింది.. హైదరాబాద్‌లో ఘోరం..! - అమరావతి తాజా వార్తలు
Man Hit by Train Mahabubnagar: మ్యూజిక్ మనసుకు ఎంతో హాయినిస్తుంది. నిజమే కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడ వింటే మాత్రం కొన్నిసార్లు ప్రాణాపాయం తప్పదు. చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని.. ఫుల్సౌండ్లో మాంచి మాస్ బీట్ పాట వింటూ వాహనాలు నడుపుతున్నారా..? రోడ్డు దాటేప్పుడు కూడా చెవిలో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇలా మ్యూజిక్ వింటూ రైలు పట్టాల మీద వెళ్లిన ఓ వ్యక్తికి ఏమైందో తెలుసా..?
Train Hits a Man Mahabubnagar: తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రభు కుమారుడు బోగం నరేష్(19) నగరంలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ బొల్లారం బజార్- బొల్లారం రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడ్ని స్థానికులు 108 అంబులెన్స్‌లో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి :అన్నం తిని పడేసిన ప్లేట్లే పట్టించాయి..