MailardevPalli murder case update: ఈ నెల 5న తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని మైలార్దేవ్పల్లిలో ఇంట్లో నుంచి వెళ్లిన యువతి హత్యాచారానికి గురైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కథనం ప్రకారం ప్రేమించిన యువకుడే పెళ్లి పేరుతో ఒత్తిడి చేయడం.. యువతి నిరాకరించడంతో చున్నీతో మెడకు ఉరి బిగించి హత్య చేసినట్లు గుర్తించారు. మైలార్దేవ్పల్లికి చెందిన యువతి డిగ్రీ చదువుతోంది. తెలంగాణలోని వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలం మానాజీపేటకు చెందిన దూరపు బంధువు శ్రీశైలంతో స్నేహం ఏర్పడింది. ఏడాది క్రితం పెళ్లి ప్రస్తావన తీసుకురాగా యువతి తండ్రి నిరాకరించాడు.
చున్నీతో ఉరివేసి కాల్వలో పూడ్చి పెట్టాడు: శ్రీశైలం మాత్రం యువతిని పెళ్లి పేరుతో ఫోన్లో వేధించేవాడు. నచ్చజెప్పేందుకు యువతిని ఈ నెల 5న వనపర్తి జిల్లా మానాజీపేటకు తీసుకెళ్లాడు. మరోసారి పెళ్లి ప్రస్తావన తెచ్చి ఒత్తిడి చేశాడు. తనను మరిచిపోవాలని యువతి సూచించగా అత్యాచారం చేసిన శ్రీశైలం.. ఆవేశంలో ఆమె చున్నీని మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు. మేనత్త కుమారుడు శివ సాయంతో సమీపంలోని కేఎల్ఐ కాల్వ పక్కనే మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు.