ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: సారూ.. మా ఊరికి తీసుకెళ్లండి..! - వలసకూలీల ఇబ్బందులు

తెలంగాణలో లాక్​డౌన్​తో వలస కూలీల పాట్లు అన్నీఇన్నీ కావు. పొట్టకూటి కోసం వలసవెళ్లిన కూలీలు.. 40 రోజులుగా లాక్‌డౌన్‌తో సొంత గ్రామానికి రాలేక, పనికెళ్లినచోట ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు.

mahabubnagar-district-people-struck-in-andhara-pradesh-state
వలస కూలీల ఇక్కట్లు

By

Published : May 1, 2020, 5:23 PM IST

Updated : May 1, 2020, 8:37 PM IST

తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా రాజోలి గ్రామానికి చెందిన సుమారు 37 మందికిపైగా కూలీలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలంలో మిరప పొలాల్లో పనిచేసేందుకు జనవరిలో వెళ్లారు. లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక 40 రోజులుగా ఇక్కట్లు పడుతున్నారు.

వారితోపాటు ఉంటున్న ఏపీ కూలీలను అక్కడి అధికారులు తరలిస్తున్నా.. తమను పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. గుడారాల్లో ఎండ, ఈదురుగాలులతో దుర్బరజీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాతోపాటుగా సాతర్ల, వెంకటాపురం, ముండ్లదిన్నె గ్రామాలకు చెందిన కూలీలంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని రాజోలి కూలీలు ఈటీవీ భారత్​కు వివరించారు.

Last Updated : May 1, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details