ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అర్థికవ్యవస్థ బలోపేతంలో బ్యాంకులు భాగం కావాలి: సీఎస్​ - lv subramaniyam

ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బ్యాంకులు భాగం కావాలని ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్బమణ్యం అన్నారు. రైతులకు రుణాలిచ్చి వారికి సహకరించాలని కోరారు

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ప్రధాన కార్యదర్శి

By

Published : Aug 22, 2019, 3:22 PM IST

దేశ ఆర్ధిక బలాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా మార్చాలనే ప్రధాని సంకల్పం నెరవేరాలంటే బ్యాంకులు చొరవ చూపాలని ప్రధాన కార్యద్రర్శి ఎల్వీ సుబ్రమణ్యం అన్నారు. విజయవాడలోని ఓ ప్రైవేటు ప్రాంతంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్ధికవ్యవస్థ బలోపేతంలో కొత్త ఆలోచనలు- బ్యాంకుల మధ్య సంప్రదింపులు అంశంపై రెండ్రోజుల పాటు రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత బ్యాంకింగ్‌ వ్యవస్థను ఇంకా మెరుగుపరచాలని కోరారు.

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ప్రధాన కార్యదర్శి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details