మూడు రాజధానులు రావొచ్చన్న సీఎం జగన్ వ్యాఖ్యలను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తప్పుబట్టారు. అమరావతిని స్వాగతిస్తున్నామని గతంలో జగన్ మాట్లాడిన ఓ వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజకీయ లబ్ది కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్ అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట... అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎంతైనా వారు మాట మార్చి, మడమ తిప్పే వర్గమని ఆక్షేపించారు.
రాజధానిపై సీఎం యూటర్న్: లోకేశ్ - జగన్పై లోకేశ్ ట్వీట్
మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తెదేపా ముఖ్యనేత లోకేశ్ తప్పుబట్టారు. అమరావతిని స్వాగతిస్తున్నామని గతంలో ఓ మాటచెప్పి... అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆరోపించారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు.
నారా లోకేశ్