రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను మరలా నిర్వహించాలని భాజపా ఎంపీ సుజనా చౌదరి కోరారు. ఏకగ్రీవాలను రద్దు చేసి మరలా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను జరపాలని కోరారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఇలా జరిగిందని గుర్తు చేశారు. దీనిపై అవసరమైతే కోర్టుకు వెళ్తామని వెల్లడించారు.
'స్థానిక ఎన్నికలను సీఈసీ ఆధ్వర్యంలో జరపాలి'
'స్థానికం'లో ఏకగ్రీవాలను రద్దు చేయాలని భాజపా ఎంపీ సుజనా చౌదరి డిమాండ్ చేశారు. మరలా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలను నిర్వహించాలని ఆయన కోరారు. దీనిపై అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు.
పులివెందుల, మాచర్ల, రాయచోటి వంటి ప్రాంతాల్లో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. ఏపీ పోలీసులు తలదించుకోవాల్సిన అవసరముందని విమర్శించారు. అలాగే వైకాపా పాలనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని విమర్శించారు. 9 నెలలుగా రాష్ట్రానికి ఏమైనా నిధులు తెచ్చారా? అని వైకాపా నేతలను ప్రశ్నించారు. నిధుల విషయంలో కేంద్రానికి ఎప్పుడైనా స్పష్టంగా లేఖలు రాశారా? అని ఎద్దేవా చేశారు. దీనితో పాటు కరోనా కట్టడికి ఇప్పటికైనా చర్యలు తీసుకోకుంటే రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కరోనా ప్రబలుతుంటే రాజకీయాలు చేస్తారా? అని మండిపడ్డారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో ఎన్నికల నియమావళి సడలింపు