ప్రకాశం జిల్లా కనిగిరి తెదేపా కార్యాలయంలో తేదేపా ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులను అభినందించారు. శాలువా కప్పి సన్మానించారు. కనిగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ బెదిరింపులను, ఒత్తిళ్లను ఎదుర్కొని విజయం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
కృష్ణా జిల్లా.. అవనిగడ్డ నియోజకవర్గంలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లను.. వైకాపా నేత, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఘనంగా సన్మానించారు. విజేతలు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.
శ్రీకాకుళం జిల్లా రాజాంలో 100 మంది సర్పంచ్లతో అభినందన సభ ఏర్పాటు చేశారు. వైకాపా ఎమ్మెల్యే కంబాల జోగులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాజాంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారితో వైకాపా నేతలు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఆమదాలవలస మండలం అక్కులపేట, శ్రీనివాసాచార్యులు పేట పంచాయతీ సర్పంచ్లు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.