రాజధాని తరలింపు అంశంపై కోర్టులో పిటిషన్ వేయాలని జనసేన నిర్ణయించింది. ఈ కేసులో తుది వరకూ బాధ్యతగా నిలబడతామని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ తర్వాత పవన్ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి విషయంలో జనసేన మొదట్నుంచీ స్పష్టంగా ఉందని పవన్ పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదనేది తమ అభిప్రాయమని చెప్పారు. ఇప్పటికే కొన్ని నిర్మాణాలు చేపట్టారు... మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయన్న పవన్... రాజధాని కోసం ఇప్పటికే రూ.వేల కోట్ల ప్రజాధనం వెచ్చించారని వివరించారు. పర్యావరణహిత రాజధాని నిర్మాణం జరగాలని చెబుతూ వస్తున్నామని పవన్ పేర్కొన్నారు.
రాజధానిపై కౌంటర్ దాఖలుకు జనసేన నిర్ణయం - pawan comments on amaravati
రాజధాని తరలింపు వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన నిర్ణయించింది. హైకోర్టులో ఉన్న వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలుకు పార్టీ ఏకాభిప్రాయానికి వచ్చింది. రాజధానికి 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదని పవన్ అభిప్రాయపడ్డారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ, ముఖ్య నేతలతో పవన్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
పవన్