ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసుల గుప్పెట్లో అమరావతి....

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు.. గృహ నిర్బంధం చేస్తున్నారు. చంద్రబాబు, ఐకాస ర్యాలీలో పాల్గొనకుండా నియంత్రించేందుకు యత్నిస్తున్నారు. అమరావతి ఐకాస ప్రజాచైతన్య యాత్ర విజయవాడ, ఏలూరు మీదుగా రాజమహేంద్రవరం వెళ్లనున్న క్రమంలో విజయవాడలో తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందును గృహ నిర్బంధం చేశారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను గృహానిర్బంధం చేశారు. బెంజి సర్కిల్​లో ఐకాస కార్యాలయం గేట్​కు పోలీసులు తాళం వేశారు.

leaders-house-arrest-in-amaravathi
leaders-house-arrest-in-amaravathi

By

Published : Jan 10, 2020, 9:40 AM IST

Updated : Jan 10, 2020, 10:48 AM IST

నేతల గృహనిర్బంధం..పోలీసులు పహారా

రాజధాని గ్రామాల్లో 24వ రోజు నిరసనలో భాగంగా... రైతులు పాదయాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలో... పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు.

3 రాజధానుల ప్రతిపాదనలను నిరసిస్తూ.... 24వ రోజు నిరసనలో భాగంగా.... అమరావతి ప్రాంత రైతులు పిలుపునిచ్చిన పాదయాత్రను అడ్డుకునేందుకు.... రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఐకాస ర్యాలీకి పోలీసుల అనుమతి లేదని.... విజయవాడలో సెక్షన్ 144, పోలీసు యాక్టు 30 అమలులో ఉందని సీపీ ప్రకటించారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగేలా ర్యాలీలు, నిరసనలు చేపట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకూ పాదయాత్రకు పిలుపునిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా... రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 144 సెక్షన్, 30 యాక్టు అమల్లో ఉన్నందువల్ల... ఎవరూ బయటకు రావద్దని ప్రకటించారు. గ్రామాల ప్రధాన కూడళ్లలో.... ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. మందడం, వెలగపూడిలోనూ..... రైతులు బయటకు రాకుండా ముందుజాగ్రత్తగా పోలీసుల మోహరించారు. పోలీసుల తీరుపై... రైతులు మండిపడుతున్నారు. శాంతియుత నిరసన తెలపుతున్న తమను.... మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని... ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకు చేపట్టే పాదయాత్రను అడ్డుకుని.... భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని మండిపడుతున్నారు.

3 రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ రైతులు పాదయాత్రకు పిలుపునిచ్చిన వేళ....కృష్ణా జిల్లాలో తెలుగుదేశం నాయకుల గృహనిర్బంధం, ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అమరావతి ఐకాస ప్రజా చైతన్య యాత్ర.... విజయవాడ, ఏలూరు మీదుగా రాజమహేంద్రవరం వెళ్లనున్న నేపథ్యంలో... ఉదయం దేవినేని ఉమను గృహానిర్బంధం చేసిన పోలీసులు... విజయవాడలో కేశినేని నాని నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ను... గృహానిర్బంధం చేశారు. అనుమతి లేకుండా... ఐకాస కార్యాలయ నిర్వహణకు సహకరించారంటూ.... వేదిక ఫంక్షన్ హాల్ కు తాళం వేశారు. యాజమాన్యానికి గురువారం నోటీసులు జారీ చేసిన పోలీసులు... పాదయాత్ర దృష్ట్యా మూసివేయించారు. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌నూ... గృహ నిర్బంధించారు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ను గృహ నిర్బంధం చేశారు.

Last Updated : Jan 10, 2020, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details