ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచభూతాలనూ ప్రతిపక్షనేత వదల్లేదు: దినకర్ - జగన్

జగన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో లోటస్ పాండ్, బెంగుళూరులో ఉన్న గృహాలు ఎందుకు చూపించలేదని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ప్రశ్నించారు. నివాస గృహాలు ఎలా సంపాదించారో... ఎవరి నుంచి దోచారో చెప్పాలని డిమాండ్ చేశారు.

గాలి, నీరు, భూమి దేన్నీ ప్రతిపక్షనేత వదలలేదు: లంకా దినకర్

By

Published : Apr 3, 2019, 4:27 PM IST

Updated : Apr 4, 2019, 11:12 AM IST

గాలి, నీరు, భూమి దేన్నీ ప్రతిపక్షనేత వదలలేదు: లంకా దినకర్
జగన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో లోటస్ పాండ్, బెంగుళూరులో ఉన్న గృహాలు ఎందుకు చూపించలేదని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ప్రశ్నించారు. నివాస గృహాలు ఎలా సంపాదించారో... ఎవరి నుంచి దోచారో చెప్పాలని డిమాండ్ చేశారు.తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి... అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్...గాలి, నీరు, భూమి అన్నింటినీ దోచుకున్నారని విమర్శించారు. పరిశ్రమలంటే ఆయన కుటుంబానికి సంబంధించినవి మాత్రమే అనుకున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్​లో తన ఆస్తులన్నీ వివరించారని తెలిపారు. హైదరాబాద్, చిత్తూరులోని గృహాలు కూడా పొందుపరిచారని చెప్పారు. ప్రజలందరికీ సాగు, త్రాగు నీరు ఇవ్వటం కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడుతుంటే.... ప్రతిపక్షనేత అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపరులు, అక్రమార్కులందరినీ జగన్‌ తన ప్రక్కన పెట్టుకొని.... తన పేపర్లో అసత్య కథనాలు రాస్తున్నారని విమర్శించారు.

Last Updated : Apr 4, 2019, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details