ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ కేసులో లాలూ ప్రసాద్​ యాదవ్​కు బెయిల్​..

దాణా కుంభకోణం కేసులో జైల్లో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్​యాదవ్​కు ఝార్ఖండ్​ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. దాణా కుంభకోణం ఐదో కేసు.. దొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్లు అక్రమంగా డ్రా చేసుకున్నారన్న అభియోగాలను నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఫిబ్రవరి 15న లాలూకు ఐదేళ్ల జైలుశిక్ష వేసింది.

By

Published : Apr 23, 2022, 10:38 AM IST

Published : Apr 23, 2022, 10:38 AM IST

లాలూ
లాలూ

దాణా కుంభకోణం కేసులో జైల్లో ఉన్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్​యాదవ్​కు ఝార్ఖండ్​ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. దాణా కుంభకోణం ఐదో కేసు.. దొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్లు అక్రమంగా డ్రా చేసుకున్నారన్న అభియోగాలను నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఫిబ్రవరి 15న లాలూకు ఐదేళ్ల జైలుశిక్ష వేసింది. ఈ తీర్పును సస్పెండ్​ చేయాలని దాఖలు చేసిన పిటిషన్​ను విచారణకు స్వీకరించటంతో పాటు బెయిల్​ మంజూరు చేసినట్లు లాలూ తరఫు న్యాయవాది తెలిపారు.

ఈ కేసులో ఇప్పటికే ఆయన సగం శిక్ష పూర్తి చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 41 నెలలు జైళ్లో ఉన్నారని.. అందుకు సంబంధించి కింది కోర్టు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించినట్లు చెప్పారు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న ఝార్ఖండ్​ హైకోర్టు.. లాలూకు బెయిల్​ మంజూరు చేసినట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details