KTR Respond Twitter Request : ప్రభుత్వ కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా ఆపదలో ఉన్నామంటూ సాయం కోరే వారికి తెలంగాణ మంత్రి కేటీఆర్ సాయం చేస్తుంటారు. అందుకే ఏ సమస్య వచ్చినా చాలామంది ట్విటర్‌లో కేటీఆర్‌కు విన్నవిస్తుంటారు. తాజాగా మరోసారి కేటీఆర్ తన ఔదార్యం చాటారు. ఓ యువ మహిళా క్రికెటర్ వైద్య ఖర్చలకు ఆర్ధిక సహాయం చేయాలని కోరుతూ.. ఆమె తండ్రి, కోచ్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
KTR: యువ క్రికెటర్‌ను ఆదుకోవాలని కోచ్ ట్వీట్.. భరోసా ఇచ్చిన కేటీఆర్ - యువ క్రికెటర్‌కు కేటీఆర్ భరోసా
KTR Respond Twitter Request : కష్టంలో ఉన్న వారికి తనకు చేతనైన సాయం చేస్తూ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ తన మానవత్వాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా ఓ యువ మహిళా క్రికెటర్ వైద్య ఖర్చుల కోసం ఆమె తండ్రి, కోచ్ ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దానికి స్పందించిన కేటీఆర్ భరోసా ఇస్తూ రీ ట్వీట్ చేశారు.
యువ క్రికెటర్‌ను ఆదుకోవాలని కోచ్ ట్వీట్
యువ క్రికెటర్ జాస్మిన్ వినికిడి సమస్యతో బాధపడుతోందని.. మంచి ప్రతిభ కనబరుస్తున్న ఆమె వైద్య చికిత్స కోసం సహాయం చేయాలని కోరుతూ.. కోచ్ శ్రీధర్, తండ్రి జగ్‌మీత్‌సింగ్ మంత్రి కేటీఆర్‌ను ట్విటర్‌లో కోరారు. ఇందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. తాను చూసుకుంటానని భరోసా ఇస్తూ.. ఈ మేరకు కేటీఆర్ రీట్వీట్ చేశారు.
ఇవీ చదవండి