ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KRMB Meeting : నీటి విడుదలపై త్రిసభ్య కమిటీ భేటీ.. ఎప్పుడంటే? - krishna water

KRMB three member committee Meeting: తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలపై త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. ప్రస్తుత ఏడాదిలో కృష్ణా జలాల విడుదలపై చర్చించేందుకు ఈనెల 9న ఈ భేటీ జరగనుంది. 2021-22లో రెండు రాష్ట్రాల అవసరాలపై సమావేశంలో చర్చించనున్నారు.

కేఆర్ఎంబీ  త్రిసభ్య కమిటీ సమావేశం
కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం

By

Published : Dec 6, 2021, 5:23 PM IST

KRMB three member committee Meeting: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రస్తుత ఏడాదిలో కృష్ణా జలాల విడుదలపై చర్చించేందుకు.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 9న సమావేశం కానుంది. రెండు రాష్ట్రాల్లో రబీ సాగునీటి అవసరాలు, వేసవిలో తాగునీటి అవసరాలపై చర్చించి, లభ్యత ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ నారాయణరెడ్డి ఆన్‌లైన్‌లో సమావేశం కానున్నారు.

KRMB meeting on water release: ప్రస్తుత సంవత్సరం (2021-22)లో రెండు రాష్ట్రాల అవసరాలు, అందుకు అనుగుణంగా నీటి విడుదలపై సమావేశంలో చర్చించనున్నారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని.. సాగు, తాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంపై చర్చించి ఆదేశాలు జారీ చేయనున్నారు.

Krishna Board on water: కృష్ణా నదికి ఈ ఏడాది భారీ ఎత్తున వరదలు రావడంతో.. ఇరు రాష్ట్రాలు అవసరమైన మేర నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు సూచించింది. వరద ప్రవాహం తగ్గాక వాడుకున్న నీటి లెక్కలు తేల్చి.. ఆ తర్వాత అవసరాలను బట్టి కేటాయిస్తామని పేర్కొంది. ప్రస్తుతం నీటి సంవత్సరం ప్రారంభంలోనే నీటి లెక్కలు తేల్చేందుకు బోర్డు సిద్ధమైంది.

ఈ క్రమంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో గత నెల 31 వరకు వినియోగించుకున్న నీటి లెక్కలు, వచ్చే మార్చి 31 వరకు సాగు, తాగునీటి అవసరాలు చెప్పాలని ఇటీవల రాష్ట్రాల ఈఎన్‌సీలను బోర్డు కోరింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాలు ఇప్పటిదాకా వినియోగించుకున్న నీరు ఆధారంగా మిగిలిన వాటా జలాలను కమిటీ కేటాయించనుంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details