Kolikapudi Padayatra: అమరావతిని కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి సమన్వయకర్త కొలికపూడి శ్రీనివాస్ రాజధాని ప్రాంతం నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. తుళ్లూరు శివాలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. గతంలో రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర మార్గంలో కొలికపూడి యాత్ర సాగనుంది. రాజధాని ఐకాస సమన్వయకర్త పువ్వాడ సుధాకర్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం బడ్జెట్‌లో రాజధానికి నిధులు కేటాయించలేదని.. సీఎం జగన్ రాజధాని నిర్మించేలా తిరుమల శ్రీనివాసుడిని వేడుకునేందుకు యాత్ర చేపట్టినట్లు కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు.
Kolikapudi Padayatra: అమరావతి నుంచి తిరుమలకు.. కొలికపూడి పాదయాత్ర..!
Kolikapudi Padayatra: అమరావతిని కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి సమన్వయకర్త కొలికపూడి శ్రీనివాస్ రాజధాని ప్రాంతం నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. తుళ్లూరు శివాలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు.
Kolikapudi Padayatra