నదీజలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. నీటి పంపిణీపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో..ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకుంటామంటే కేంద్రం పూర్తి స్థాయిలో మద్దతిస్తుందన్నారు. ఇరు ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నదే...... తమ ఆకాంక్ష అని కిషన్‌రెడ్డి చెప్పారు.
'నదీ జలాల వివాదాలపై ముఖ్యమంత్రులు చర్చించుకోవాలి'
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాలను ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ముఖ్యమంత్రులు చర్చించుకుంటే కేంద్రం పూర్తిస్థాయి మద్దతిస్తుందని ఆయన అన్నారు.
కిషన్ రెడ్డి