మా కంటే రామోజీ గ్రూప్ తపనే ఎక్కువ: సీఎం విజయన్ - కేరళలో వరదల వార్తలు
కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కంటే.. రామోజీ గ్రూప్ ఎక్కువ ఆసక్తి చూపిందని సీఎం పినరయి విజయన్ అన్నారు. రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
కేరళలో వరద బాధితులకు.. రామోజీ గ్రూపు నిర్మించిన గృహాల అందజేత కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రసంగించారు. రామోజీ ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. అలెప్పీ ప్రజలను ఆదుకోవాలని రామోజీ గ్రూపు బలంగా నిశ్చయించుకుందని అన్నారు. కేరళ ప్రభుత్వం కంటే ఎక్కువ ఆసక్తి, తపన వారే చూపారని వ్యాఖ్యానించారు. అంత సంకల్పం ఉన్నందునే ఈ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. రామోజీ గ్రూప్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నుంచి అలెప్పీ వరకు కదలివచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.