ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిర్మాణరంగ కార్మికులను ఆదుకోండి: సీఎంకు కన్నా లేఖ - నిర్మాణ రంగ కార్మికులు ఆదుకోవాలని కన్నా లేఖ

నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.196 కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. ఈ నిధులతో రాష్ట్రంలోని 19 లక్షల మంది కార్మికులను ఆదుకోవాలని కోరుతూ.. సీఎం జగన్​కు లేఖ రాశారు.

సీఎంకు కన్నా లేఖ
సీఎంకు కన్నా లేఖ

By

Published : May 6, 2020, 12:24 PM IST

సీఎం జగన్​కు కన్నా లేఖ

సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లేఖ రాశారు. నిర్మాణరంగ కార్మికులందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. ఇసుక కొరత, టెండర్ల రద్దు, కరోనాతో కార్మికులు ఉపాధి కోల్పోయారని కన్నా చెప్పారు.

భవననిర్మాణ కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. నిర్మాణరంగ కార్మికులకు కేంద్రం రూ.196 కోట్లు ఇచ్చిందన్న కన్నా.. ఆ నిధులతో 19 లక్షలమంది కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని లేఖలో కోరారు.

ABOUT THE AUTHOR

...view details