తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు...వైకాపా అధినేత జగన్కు బహిరంగలేఖ రాశారు. జగన్ కుటుంబానికి 3 తరాల నేరచరిత్ర ఉందన్నారు. 22 ఏళ్ల వయస్సులోనే సింహాద్రిపురంలో పోలీస్ అధికారి ప్రకాష్‌బాబుపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. నిజాయతీ పరులైన ఎంతోమంది ఐఏఎస్‌లు, పారిశ్రామికవేత్తలు జైళ్లకు పంపించిన ఘనత ఆయనదేనని విమర్శించారు.
శవరాజకీయాలు చేస్తోంది మీరు కాదా...?
2014 శాసనసభ ఎన్నికల్లో తన తండ్రి ... వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్నిప్రచారం చేసుకుని ఓట్లు అడిగారని జగన్పై మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో తన బాబాయి వివేకానంద రెడ్డి హత్యను రాజకీయంగా వాడకోవాలని చూస్తున్నారని విమర్శించారు. శవ రాజకీయాలు చేయటంలో ప్రతిపక్షనేతకు ఎవరూ సాటిరారని ఎద్దేవా చేశారు.
అలిపిరి దాడికేసులో ముద్దాయి మీ ప్రియనేస్తం కాదా....?
సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి బాంబు దాడిలో ముద్దాయి, ఎర్రచందనం డాన్ కొల్లం గంగిరెడ్డి జగన్కుప్రియ నేస్తం కాదా... అని కళా ప్రశ్నించారు.