ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తమిళనాడులో చిక్కుకున్నవారిని ఆదుకోండి'

తమిళనాడులో చిక్కుకున్న వలస కూలీలను స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు సీఎం జగన్​కు లేఖ రాశారు. పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన కూలీలు లాక్​డౌన్ వల్ల అక్కడ చిక్కుకున్నారని వివరించారు. పనులు లేక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి వారికి తాత్కాలికంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారిని వీలైనంత తొందరగా రాష్ట్రానికి తీసుకురావాలని కోరారు.

సీఎం జగన్​కు కళా లేఖ
సీఎం జగన్​కు కళా లేఖ

By

Published : Apr 26, 2020, 9:56 PM IST

సీఎం జగన్​కు కళా వెంకట్రావు లేఖ

తమిళనాడులో చిక్కుకున్న రాష్ట్ర వలస కూలీలను స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని... సీఎం జగన్​కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లేఖ రాశారు. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన తెలుగు వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాలకు చెందిన సుమారు 300 మంది ఉపాధి కోసం తమిళనాడుకు వలస వెళ్లారన్నారు. పనులు అయిపోయి ఇంటికి రావాల్సిఉండగా లాక్​డౌన్ వల్ల తమిళనాడులో చిక్కుకుపోయారని తెలిపారు. తినడానికి తిండి లేక, ఉండడానికి వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

ఇళ్లు కూలీపోయి రోడ్డునపడ్డారు

వలస కూలీలు ఉంటున్న ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి గుడిసెలు నేలమట్టమై బియ్యం, కూరగాయలు తడిసిపోయి తీవ్రఇబ్బందులు పడుతున్నారని కళా వివరించారు. తమిళనాడులోని వెల్లపుకోట గ్రామం, ఊతుకోట మండలం, తిరువల్లూరు జిల్లాలో 80 మంది, ఉదుకోట జిల్లా కంధర కోటై మండలం మంగళూర్ గ్రామంలో 220 మంది చిక్కుకున్నారని వివరించారు. తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి వారికి వసతి, భోజన సౌకర్యం కల్పించాలన్నారు. కూలీలను వెంటనే స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి :ఆ రంగంలో ఇప్పుడు నష్టాలున్నా తర్వాత లాభాలే..!

ABOUT THE AUTHOR

...view details