ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నాడు అభివృద్ధికి నిలయమైతే.. నేడు అప్పులు, అరాచకాలకు కేరాఫ్'

By

Published : Jun 2, 2021, 11:57 AM IST

వైకాపా రెండేళ్లపాలనపై తెదేపా నేత కళా వెంకట్రావ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెదేపా హయాంలో రాష్ట్రం అభివృద్ధికి నిలయంగా ఉంటే.. ఇప్పుడు వైకాపా పాలనలో అప్పులు, ఆరాచకాలకు కేరాఫ్​గా మారిందని అన్నారు.

ala Venkatrao
ala Venkatrao

తెదేపా ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నిలయంగా ఉన్న ఆంధ్రప్రదేశ్... వైకాపా 2 ఏళ్ల పాలనలో అప్పులు, అరాచకాలకు కేరాఫ్​​గా మారిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు దుయ్యబట్టారు.

"దొంగ చేతికి తాళాలిచ్చినట్లు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని నాశనం చేశారు. 90 శాతం పైగా పథకాలు అప్పులతో అమలు చేస్తూ నవరత్నాల పేరుతో సంక్షేమానికి అరకొర నిధులిచ్చి ప్రజల్ని మోసగిస్తున్నారు. ఒక్క పరిశ్రమ తీసుకురాకుండా, ఏ ప్రాజెక్టూ పూర్తి చేయకుండా పేదలకు ఇళ్లు నిర్మించకుండా.. అప్పు మాత్రం రూ.1.65లక్షల కోట్లు పైబడి చేశారని దుయ్యబట్టారు. తెచ్చిన అప్పు తీర్చటానికి మళ్లీ అప్పు చేస్తూ ఒక్కో కుటుంబంపై రూ.2.50లక్షల భారం మోపారు" - కళా వెంకట్రావు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు

గతంలో 11.2 శాతంగా ఉన్న రాష్ట్ర వృద్ధి రేటు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక 3 శాతానికి పడిపోయిందని కళా విమర్శించారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి... సి అంటే క్యాపిటల్, పి అంటే పోలవరం, ఎస్ అంటే స్పెషల్ స్టేటస్​ను పూర్తిగా రద్దు చేశారని ఆగ్రహించారు. అధికారంలోకి రాగానే డీఏ అమలు చేస్తానని చెప్పి.. డీ అంటే డిమోలైజ్, ఏ అంటే అటాక్స్ అనే కొత్త నిర్వచనం చెప్పారన్నారు. రెండేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మేలు కంటే నష్టమే ఎక్కువ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇదీ చదవండి:

Judge Ramakrishna: పీలేరు సబ్ జైలుకు జడ్జి రామకృష్ణ తరలింపు

ABOUT THE AUTHOR

...view details