కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో రాష్ట్రంలో.. పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించటం అవివేకమని కేఏ పాల్ అన్నారు. విజయవాడలో పాల్ మాట్లాడుతూ కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారనీ... రాష్ట్రంలో సైతం పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్ - ka paul recent news
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్, మంత్రులు తమ పిల్లలను పరీక్షలకు పంపుతారా అని ప్రశ్నించారు. కరోనా సునామీ కన్నా ప్రమాదకరంగా మారిందని..దేశంలో ఎన్నో లక్షలమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎన్నికల సమయాల్లో బహిరంగ సభలు,సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా ప్రబలడానికి రాజకీయ నేతలు,ఎన్నికల సంఘం కారణమయ్యారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడంపై హైకోర్టులో పిటిషన్ వేశామని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. ఏపీ హైకోర్టు పరీక్షలపై నిర్ణయం తీసుకోకపోతే... విద్యార్థులు కరోనాకు బలైపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:నిబంధనలు గాలికొదిలేయడం వల్లే వైరస్ విస్తరణ: డాక్టర్ బుర్రి రంగారెడ్డి