ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CJI: "చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్‌ మార్క్‌గా కేసీఆర్‌": జస్టిస్​ ఎన్వీ రమణ - Justice NV Ramana appreciation

Justice NV Ramana: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022లో ముఖ్య అతిథులుగా సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషిని సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ అభినందించారు.

CJI Justice NV Ramana
తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022లో ముఖ్య అతిథులుగా సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

By

Published : Apr 15, 2022, 12:32 PM IST

Updated : Apr 15, 2022, 1:28 PM IST

Justice NV Ramana: న్యాయవ్యవస్థను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించారు. సదస్సుకు ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారని.... తెలంగాణలో కేసీఆర్‌ మాత్రం 4 వేల 320కి పైగా ఉద్యోగాలను సృష్టించారని అభినందించారు. చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్‌ మార్క్‌గా కేసీఆర్‌ అని జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు.

"చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్‌ మార్క్‌గా కేసీఆర్‌"

"హైకోర్టులో ఇటీవల జడ్జిల సంఖ్య పెంచాం. కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల సంఖ్య పెంపు అవసరం. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించాం. న్యాయవ్యవస్థను ఇంకా బలపరచాలని భావిస్తున్నాం. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారు. తెలంగాణలో కేసీఆర్‌ మాత్రం 4,320కి పైగా ఉద్యోగాలను సృష్టించారు. ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ మీడియేషన్‌ సెంటర్‌ వచ్చింది. వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతోంది. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు."

- జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

CM KCR speech: రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని... న్యాయరంగంలోనూ పురోగమించేలా కృషిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామని.... ఆయా జిల్లాల్లో కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు అమితమైన ప్రేమ ఉందని.... హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవ్యవస్థ సమర్ధంగా పనిచేయడం కోసం అదనపు సిబ్బందిని మంజూరు చేసినట్లు వివరించారు.

హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచినందుకు కృతజ్ఞతలు

"8 ఏళ్ల క్రితం తెలంగాణ.. రాష్ట్రంగా ఆవిర్భవించింది. అందరి సహకారంతో చక్కగా పురోగమిస్తోంది. పటిష్ట ఆర్థిక పురోగతిని సాధిస్తున్నాం. విద్యుత్‌ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాం. వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నాం. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం ఇంకా ముందుకెళ్లాలి. హైదరాబాద్‌ పట్ల జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు చాలా ప్రేమ ఉంది. సుదీర్ఘ కాలం పనిచేసినందున జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు అన్ని విషయాలు తెలుసు. తెలంగాణలో బెంచ్‌ల పెంపుపై ఆనందంగా ఉంది. బెంచ్‌ల పెంపునకు అనుగుణంగా సిబ్బంది కూడా కావాలి. జిల్లా కోర్టులకు అదనపు సిబ్బందిని కేటాయింపు జరుగుతోంది. జిల్లాల్లో కోర్టు భవనాల కోసం స్థల సేకరణ జరుగుతోంది. హైకోర్టు జడ్జిలకు హోదాకు తగ్గ స్థాయిలో 42 మంది జడ్జిలకు క్వార్టర్స్‌ నిర్మాణం చేస్తున్నాం."

- కేసీఆర్​, తెలంగాణ ముఖ్యమంత్రి

ఇదీ చదవండి: కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి.. నగ్న చిత్రాలు తీసి

Last Updated : Apr 15, 2022, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details