ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఏప్రిల్‌ మూడోవారంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌?

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. సాగర్​ ఉపఎన్నిక తర్వాత మొదటి నోటిఫికేషన్​ వెలువడే అవకాశం ఉంది. అన్ని శాఖల నుంచి తెప్పించిన ఖాళీల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం సీఎం కేసీఆర్‌కు సమర్పించారు.

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ

By

Published : Mar 29, 2021, 8:28 AM IST

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఖాళీల లెక్క తేలడంతో ప్రభుత్వం నియామకాల ప్రక్రియ చేపట్టనుంది. నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత వచ్చే నెల మొదటి వారంలో మొదటి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అన్ని శాఖల నుంచి తెప్పించిన ఖాళీల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదివారం సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. మొత్తం ఖాళీలు 55 వేల కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. గతంలో 50 వేలుగా అంచనా వేయగా, తాజాగా పదోన్నతుల అనంతరం మరో అయిదువేల పోస్టులు తేలాయి. ఉపాధ్యాయ పదోన్నతులు చేపడితే ఖాళీలు మరో అయిదు వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన గణాంకాల మేరకు పోలీసు శాఖలో అత్యధికంగా, ఆ తర్వాత విద్య, వైద్యఆరోగ్య శాఖల్లో అధిక పోస్టులున్నాయి. రెవెన్యూ పురపాలక , వ్యవసాయ, నీటిపారుదల శాఖల్లోనూ గణనీయంగానే లెక్కతేలాయి.

ఒకట్రెండు రోజుల్లో సీఎం సమీక్ష

ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్​ ఒకట్రెండు రోజల్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఖాళీలు, వాటి భర్తీ ప్రక్రియ, నియామక సంస్థల ఎంపిక వంటి అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ నియామకాలపై మంత్రి మండలి ఆమోదం పొంది, ఆయా శాఖలను సన్నద్ధం చేయాల్సి ఉంది. నాగార్జున సాగర్​ ఉపఎన్నిక వచ్చే నెల 17న జరగనుంది. ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టే వీలుంది.

ఇదీ చదవండి:

'భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి'

ABOUT THE AUTHOR

...view details