exams postpone due to cyclone: జవాన్ తుపాను కారణంగా శనివారం జరగాల్సిన యూజీసీ-నెట్ పరీక్షను జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్లో) ఎంబీఏ ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షను సైతం జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించాల్సి ఉండగా... తుపాను ప్రభావముండే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వాయిదా వేసింది. తదుపరి తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.
తుపాన్ ప్రభావమెప్పుడు..
రాష్ట్రంలో జవాద్ తుపాను ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటాక బంగాళాఖాతం వైపు వెళ్తుందని ఒడిశా ప్రత్యేక సహాయ కమిషనర్ పీకే జెనా తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పుర్ జిల్లాల్లో అధికారులు శనివారానికి రెడ్ ఎలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి గాలుల వేగం పెరిగే అవకాశం ఉందని... ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. తుపాను కారణంగా 95కు పైగా రైళ్లు రద్దయ్యాయి.