మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసేన.. కొంతమేరకు ప్రభావం చూపింది. భాజపాతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ ఎన్నికల బరిలో దిగింది. కానీ... ఈ రెండు పార్టీలు కలిసి అన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. రాష్ట్రంలో తమ పార్టీ 320 వార్డుల్లో పోటీ చేసిందని జనసేన పేర్కొంది. 18 వార్డుల్లో విజయం సాధించింది. 10 మున్సిపాలిటీల్లో బోణీ కొట్టింది. ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ ప్రభావం ఉంటుందని భావించినా.. పెద్దగా విజయం సాధించలేదు.
అమలాపురంలో 6 వార్డులు గెలుచుకుంది. ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో 4 వార్డులు గెలుచుకుంది. మొత్తంగా నగరాల్లో జనసేన 224 డివిజన్లలో పోటీ చేసి 7 చోట్ల గెలుపొందింది. గుంటూరులో 2 చోట్ల, ఒంగోలు, మచిలీపట్నంలో ఒక్కో డివిజన్‌లో విజయం సాధించింది. ఏఏ స్థానాల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో పరిశీలిస్తున్నామని,పార్టీ ప్రభావంపై అంచనా వేసుకుంటామని పార్టీ నాయకులు చెబుతున్నారు. గుంటూరు కార్పొరేషన్లో 2 స్థానాలు సొంతం చేసుకుంది.
విశాఖలో 4 స్థానాల్లో జనసేన గెలుపు