కాపు రిజర్వేషన్.. రాజకీయ స్వార్థపరుల గుప్పెట్లో నలిగిపోతున్న కోట్లాది మంది కోరిక అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు కాపు రిజర్వేషన్లపై ఓ ప్రకటన విడుదల చేశారు. అవకాశ వాద రాజకీయ శక్తులు రిజర్వేషన్ల కోరికను ఓట్ల సాధనకు వేదికగా మార్చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశం.. గత 56 ఏళ్లుగా కాపుల పట్ల కపట ప్రేమను నటిస్తూ.. ఓట్లు దండుకుని అధికారంలోకి రావడం కోసం చేసే రాజకీయ క్రీడగా మారిపోయిందని ధ్వజమెత్తారు. తమకు రిజర్వేషన్ అమలు చేయాలని కాపులు అడిగినప్పుడల్లా.. ముందు నుంచి సై.. అంటూ వెనుక నుంచి నై.. అంటూ పరోక్షంగా ఇతర వర్గాలను రెచ్చగొడుతూ కాపుల నోట్లో మట్టి కొడుతున్నారని పవన్ ఆరోపించారు.
మొసలి కన్నీరు కారుస్తున్నారు