ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లెక్కల గారడీలొద్దు.. ప్రజల్లో మార్పు కనిపిస్తోంది: జనసేన

తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న లెక్కలు అసత్యాలేనని జనసేన నేతలు విమర్శించారు. భాజపా, జనసేన బలపరచి గెలిచిన అభ్యర్థులను అభినందిస్తూ.. ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు.

janasena leaders comments
లెక్కల గారడీలు వద్దు.. ప్రజల్లో మార్పు కనిపించింది

By

Published : Feb 10, 2021, 7:09 PM IST

రాష్ట్రంలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు లెక్కల గారడీలు చేస్తున్నాయని జనసేన పార్టీ నేతలు విమర్శించారు. ఓటింగ్ శాతం తమకే ఎక్కువగా ఉందంటూ పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారని జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు.

ప్రజల్లో మార్పొచ్చింది..

పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపరచి గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను పార్టీ నేతలు అభినందించారు. ఎలాంటి హంగూ, ఆర్బాటం, నగదు పంపిణీ లేకుండా కేవలం ప్రజల మద్దతుతో గెలిచిన ఏకైక పార్టీ జనసేన ఆయన అన్నారు. మిత్ర పక్షమైన భాజపా సహకారంతో 250 మంది జనసేన మద్దతుతో సర్పంచ్​లుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. ఈ ఫలితాలు ప్రజల్లో వచ్చిన మార్పునకు చిహ్నంగా భావిస్తున్నామని చెప్పారు.

సీఎంవి ఉత్తి లేఖలే..

విశాఖ ఉక్కు విషయంలోనూ వైకాపా డబుల్ గేమ్ ఆడుతోందని శ్రీనివాస్​ విమర్శించారు. ఇక్కడ లేఖలు రాసి..‌ కేంద్రం దగ్గరకు వెళ్లి‌ చేతులు కట్టుకుంటున్నారన్నారని ఆరోపించారు.

ప్రచారమే అంతా..

ఇరు పార్టీల ప్రకటనలు చూస్తే 150 శాతం ఓటింగ్ జరిగినట్లు ఉందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. రెండేళ్ల జగన్ పాలనలో‌ చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువన్నారు. అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసిన వైకాపాకు‌ 80 శాతం ఓట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.

ఇదీ చదవండి:

'విశాఖ ఉక్కు ప్రజల మనోభావాలకు చెందిన అంశం'

ABOUT THE AUTHOR

...view details