అమరావతిలో వైకాపా ఎంపీలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పోలవరానికి ఖర్చుపెట్టిన దాంట్లో ఇంకా రూ.3,222 కోట్లు రావాల్సి ఉందని సీఎం ఎంపీలకు వివరించారు. ఆర్‌ఆర్ కోసం రూ.10 వేల కోట్లు, నిర్మాణ పనులకు రూ.6 వేల కోట్లు కోరాలని సూచించారు. రెవెన్యూ లోటు కింద ఇవ్వాల్సిన మొత్తాన్నీ ప్రస్తావించాలన్న సీఎం... వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై ప్రస్తావించండని దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు 12 లక్షల ఇళ్లు కేటాయించాలని కోరాలని సీఎం జగన్ సూచించారు. ఇళ్ల కోసం ప్రస్తుతం ఉన్న అర్హతలను సడలించాలని లేఖ రాద్దామన్న ముఖ్యమంత్రి... ప్రత్యేక హోదాపై వాణి వినిపించాలని చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎంపీలకు సూచించారు.
ప్రత్యేక హోదాపై వాణి వినిపించాలి: సీఎం జగన్ - jagan comments on mps
వైకాపా ఎంపీలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశం ముగిసింది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించిన జగన్... పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక హోదాపై వాణి వినిపించాలని సూచించారు.
ప్రత్యేకహోదాకు ప్రాధాన్యమివ్వాలని జగన్ ఆదేశించినట్లు ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. పోలవరానికి రావాల్సిన నిధులపై మంత్రితో చర్చించాలని సూచించినట్లు వివరించారు. రామాయపట్నం పోర్టు, రెవెన్యూ లోటుపై గట్టిగా అడగాలని సీఎం చెప్పారన్నారు. హోదా కోసం వైకాపా ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలనూ... కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఉద్ఘాటించారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల గురించి లేవనెత్తుతామని ఎంపీ సత్యవతి చెప్పారు.
ఇదీ చదవండీ... పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం