ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఎస్​ఆర్ ''లా నేస్తం''... ప్రారంభించిన సీఎం జగన్

అధికారంలోకి వచ్చాక పలు  కార్యక్రమాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్... తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు. అదే వైఎస్ఆర్ లా నేస్తం. ఈ  పథకం కింద జూనియర్ లాయర్లకు ప్రభుత్వం ప్రతి నెల రూ.5వేలు స్టైఫండ్ ఇవ్వనుంది. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఇవాళ ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

By

Published : Dec 3, 2019, 8:14 PM IST

jagan launched ysr law nestham
jagan launched ysr law nestham

భృతికి అర్హతలు..

  1. దరఖాస్తుదారు లా డిగ్రీ పొంది ఉండాలి.
  2. దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షన్‌ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.
  3. కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.
  4. న్యాయవాద చట్టం 1961 సెక్షన్‌ 22 ప్రకారం రోల్‌లో నమోదైన తొలి మూడేళ్ల ప్రాక్టీసు సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
  5. జీవో జారీ అయ్యే నాటికి జూనియర్‌ లాయర్లు ప్రాక్టీసు ప్రారంభించి... తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్‌కు అర్హులు.
  6. 15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం కలిగిన సీనియర్‌ న్యాయవాదులు లేదా సంబంధిత బార్‌ అసోసియేషన్‌ నుంచి... ధ్రువీకరణ పత్రంతో ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి 6 నెలలకు జూనియర్‌ అడ్వొకేట్స్‌ అఫిడవిట్‌ను సమర్పించాలి.
  7. న్యాయవాద వృత్తి నుంచి వైదొలిగినా, ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినా... ఆ వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
  8. బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరునమోదు చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకు వారి సర్టిఫికెట్లు బార్‌ కౌన్సిల్‌లో ఉంచాలి.
  9. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింపజేస్తారు.
  10. ప్రతి దరఖాస్తు దారు ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి.
  11. జీవో జారీ చేసేనాటికి జూనియర్‌ న్యాయవాది 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
  12. జీవో జారీ అయ్యే నాటికి తొలి మూడేళ్ల ప్రాక్టీసు పూర్తి అయి ఉంటే అనర్హులు
  13. జూనియర్‌ న్యాయవాది పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు
  14. నాన్‌ ప్రాక్టీసు న్యాయవాదులు అనర్హులు
  15. అర్హులు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  16. లా డిగ్రీతో పాటు పుట్టిన తేదీ ధ్రువపత్రం అప్‌లోడ్‌ చేయాలి.
  17. సీనియర్‌ న్యాయవాది ధ్రువీకరణతో బార్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ అయినట్లు అఫిడవిట్‌ అప్‌లోడ్‌ చేయాలి.
  18. దరఖాస్తుతో పాటు ఆధార్‌ నంబర్‌ను పొందుపరచాలి.
  19. దరఖాస్తుదారు నిర్దేశిత బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి.

ABOUT THE AUTHOR

...view details