అక్రమాస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని కోరుతూ.. సీఎం జగన్ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదన్న ఆయన.. ఛార్జ్‌షీట్ నుంచి తొలగించాలని కోరారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య కూడా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికీ డిశ్చార్జి పిటిషన్లు వేయని నిందితులకు చివరి అవకాశం ఇస్తున్నామని స్పష్టం చేస్తూ న్యాయస్థానం విచారణను సెప్టెంబరు 3కి వాయిదా వేసింది. ఓబుళాపురం గనుల కేసులో అభియోగాల నమోదుపై తెలంగాణ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వాదనలు ముగిశాయి. సీబీఐ వాదనల కోసం విచారణను న్యాయస్థానం ఈనెల 31కి వాయిదా వేసింది. ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ ఈనెల 31కి వాయిదా పడింది.
jagan cbi case: అక్రమాస్తుల కేసులో తన పేరు తొలగించాలని.. సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ - నాంపల్లి కోర్టులో జగన్ కేసుల విచారణ
సీఎం జగన్ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఛార్జ్ షీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరారు.
jagan discharge petition in cbi court