విచారణకు హాజరుకాని ముఖ్యమంత్రి జగన్.. ఎందుకంటే..! - జగన్ అక్రమాస్తుల కేసుపై వార్తలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో విచారణకు సీఎం జగన్ హాజరు కాలేదు. ముఖ్యమంత్రి అయినా సరే.. ప్రతి శుక్రవారం రావాల్సిందే అని న్యాయస్థానం చెప్పినా కూడా.. సీఎం ఎందుకు విచారణకు హాజరు కాలేదంటే...!
సీబీఐ కోర్టులో విచారణకు హాజరుకాని జగన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి సీబీఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉన్న సీఎం జగన్... ఇవాళ రాష్ట్రంలోనే ఉన్నారు. కేంద్ర మంత్రి పర్యటన ఉన్నందున న్యాయస్థానాన్ని మినహాయింపు కోరారు. ఆయన అభ్యర్థనను సీబీఐ కోర్టు మన్నించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.