ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రయాన్-2 ప్రయాణం ఇలా..! - hcu processor

జులై 22న ప్రయోగించిన చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని కక్ష్యలో చేరింది. మరో కొద్ది రోజుల్లో చంద్రునిపై ల్యాండర్, రోవర్ చేసే పరిశోధన, చంద్రయాన్ మిషన్ వివరాలు ఇస్రో మాజీ శాస్త్రవేత్త మక్బూల్ అహ్మద్ మాటలలో...

చంద్రయాన్-2 ప్రయాణం ఇలా..!

By

Published : Aug 20, 2019, 8:24 PM IST

చంద్రయాన్-2 ప్రయాణం ఇలా..!

యావత్ భారతావని గర్వించే సమయం దగ్గరలోనే ఉంది. చందమామ కక్ష్యలో చంద్రయాన్ -2 మిషన్ ప్రవేశించింది. జులై 22 ప్రారంభమైన చంద్రయాన్-2 యాత్ర నేడు మరో కీలకఘట్టానికి తెరతీసింది. ఇప్పటి వరకూ భూ కక్ష్యలో ఉన్న చంద్రయాన్ వ్యోమనౌక.. ఇప్పుడు చంద్రుని కక్ష్యలో ప్రవేశించింది. సెప్టెంబర్ 7న చంద్రునిపై లాండర్, రోవర్ దిగనున్నాయి.

114 x 18072 కక్ష్యలో

ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం ఉదయం 9.02 గంటలకు చంద్రయాన్ వేగాన్ని తగ్గించి వ్యోమనౌక దిశను మార్చారు. ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో..ఆర్బిటర్​ను జాబిల్లికి మరింత చేరువ చేశారు. ఓరియెంటేషన్‌ ప్రక్రియతో చంద్రయాన్‌-2 దశ దిశ మార్చారు. ఉపగ్రహం చంద్రుడి 114కి.మీ x 18072 కి.మీ కక్ష్యలోకి చేరింది. మొత్తం ప్రక్రియను వ్యోమనౌక ద్రవ ఇంజిన్‌ను మండించడం ద్వారా చేపట్టారు.

మరో రెండు విన్యాసాలు

ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో ఉన్న చంద్రయాన్‌-2పై మరో నాలుగు విన్యాసాలు చేపట్టనున్నారు. ఆగస్టు 21, 28, 30న చేపట్టే ప్రయోగాలు చంద్రయాన్-2ను జాబిల్లికి చేరువ చేస్తోంది. సెప్టెంబరు 2వ తేదీన ల్యాండర్‌పై రెండు విన్యాసాలు చేపట్టి...మృదువుగా ల్యాండింగ్‌ చేయనున్నారు. సెప్టెంబరు 7వ తేదీ తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో ల్యాండింగ్‌ చేస్తారు. ఆర్బిటర్‌, ల్యాండర్‌లోని కెమెరాలతో ల్యాండింగ్‌ ప్రాంత చిత్రాలను తీస్తారు. 4 గంటల తర్వాత ల్యాండర్​ నుంచి రోవర్‌ బయటకువస్తుంది. సెకనుకు సెంటీమీటరు వేగంతో ఈ రోవర్ 14 రోజుల పాటు చంద్రునిపై పయనించనుంది. రోవర్ తీసిన డేటాని ల్యాండర్‌ ద్వారా 15 నిమిషాల్లో భూమిపై చేరవేయనుంది.

ఇదీ చదవండి:

జాబిల్లి వైపు చంద్రయాన్​ మూడో అడుగు

ABOUT THE AUTHOR

...view details