Police officer arrested: తప్పు చేస్తే శిక్షించాల్సిన పోలీసులే తప్పుడు పనికి పాల్పడ్డారు. రోజూ స్టేషన్కు అలాంటి గొడవల విషయంలో దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాల్సిన రక్షక భటులే తప్పు చేశారు. పోలీసు అధికారి కుటుంబ విషయంలో మరో పోలీసు అధికారి మితిమీరిన జోక్యం చేసుకోవడంతో పాటు అతణ్నే బెదిరించాడు. ఈ ఘటనపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండలో ఉంటున్న పోలీసు అధికారి వేరే జిల్లాలో పని చేస్తున్నారు. ఆయన సతీమణి సైతం నగరంలో పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తనతోపాటు పనిచేస్తున్న మరో అధికారికి ఆమె తరచూ ఫోను చేస్తుండడంతో గమనించిన భర్త పలుసార్లు హెచ్చరించారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్యతో మాట్లాడుతున్న అధికారిని కూడా ఆయన మందలించారు. అయినప్పటికీ వారు తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు.