ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు (inter second year exams) జులై మధ్యలో నిర్వహించే యోచన ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుతం తెలిపింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ రాసింది. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి గంటన్నరకు తగ్గించే యోచన ఉన్నట్లు విద్యాశాఖ కార్యదర్శి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే సిద్ధమైనందున పరీక్ష విధానం మార్చలేమని స్పష్టం చేశారు.
TS inter second year exams: తెలంగాణలో జులైలో సీనియర్ ఇంటర్ పరీక్షలు! - జులైలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు (inter second year exams) జులై మధ్యలో నిర్వహించే యోచన ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుతం తెలిపింది. ప్రశ్నాపత్రాలు ఇప్పటికే సిద్ధమైనందున పరీక్ష విధానం మార్చలేమని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు
ప్రశ్నా పత్రంలోని సగం ప్రశ్నలే రాసేందుకు అవకాశమిస్తామని తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం 2 ప్రశ్నా పత్రాలతో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కొవిడ్ వల్ల రాయలేకపోయిన వారికి మరోసారి పరీక్ష పెడతామని పేర్కొన్నారు. ఆగస్టు చివర్లో ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామన్నారు.
ఇదీ చదవండి:Lock Down: ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారా.. అయితే ఈ పని చేయాల్సిందే!