Inter: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి 12వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఇంటర్మీడియట్ మొదటి ఏడాది వారికి, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఆగస్టు 17 నుంచి 22వరకు ఉంటాయని, నైతికత, మానవ విలువలు పరీక్ష 24న, పర్యావరణం పరీక్ష 26న నిర్వహిస్తామని వెల్లడించారు. అభ్యర్థులు జులై 8లోపు పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు.
Inter: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. అప్పటినుంచే - ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
Inter: రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు జులై 8లోపు పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాలని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు.
సప్లిమెంటరీ పరీక్షలు