ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిర్భయ పేరుతో చట్టం... కానీ ఆమెకు ఇంకా న్యాయం జరగలేదు'

దిశ కేసులో నిందితులను ఎన్​కౌంటర్​ చేశారు. కానీ 2012లో జరిగిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఇప్పటికీ నిందితులకు శిక్ష పడలేదు. 2017లో సుప్రీం వారికి ఉరిశిక్ష విధించినా ఇంకా అమలు కాలేదని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

injustice in nirbhaya case
injustice in nirbhaya case

By

Published : Dec 6, 2019, 12:48 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్​ పట్ల మెజారిటీ ప్రజలు సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఘటన జరిగిన 9 రోజుల్లోపే నిందితులను ఎన్​కౌంటర్​ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ చూసినా దిశకు న్యాయం జరిగిందన్న గళమే వినిపిస్తోంది.

ఏడేళ్లైనా... న్యాయం జరగలేదు

కానీ 2012 డిసెంబర్​ 16న దిల్లీలో జరిగిన నిర్భయ హత్యాచారంలో నిందితులకు ఇంకా శిక్ష పడకపోవడంపై మళ్లీ దేశవ్యాప్తంగా చర్చమొదలైంది. నిర్భయ ఘటనలో మొత్తం ఆరుగురిని దోషులుగా గుర్తించగా... ఒక వ్యక్తి తీహార్​ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా ఐదుగురిలో ఒకరు మైనర్​ కావడం వల్ల మూడేళ్ల తర్వాత విడుదలయ్యాడు. మిగతా నలుగురు దోషుల్ని జైళ్లోనే ఉంచారు.

దిశ కేసులో ఎన్​కౌంటర్​ చేసినట్లే..

2017 మే 5న సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించినప్పటికీ ఇంకా అమలు కాలేదు. అప్పటి నుంచీ ఇప్పటివరకూ జైల్లో ఉంచడం ఎందుకని...దిశ కేసులో ఎన్‌కౌంటర్ చేసినట్లే...చంపేయాలని నెటిజన్లు సోషల్​మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లేదంటే కోర్టు ఆదేశాల ప్రకారం.. ఉరిశిక్షైనా వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నిర్భయ పేరు మీద ప్రత్యేకంగా ఓ చట్టమే తీసుకొచ్చినా....ఆమెకు మాత్రం న్యాయం జరగలేదని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా అత్యాచారాలు, హత్యలు ఏం తగ్గలేదని ఎత్తిచూపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details