యువతకు అత్యున్నత స్థాయి నైపుణ్య శిక్షణ అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో.. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ అకాడమీలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఐఎస్బీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో.. ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లూట్ల, ఏపీఎస్ఎస్ డీసీ ఛైర్మన్ అజయ్ రెడ్డి ఒప్పందాలను మార్చుకున్నారు.
ISB: యువతకు ఐఎస్బీ నైపుణ్య శిక్షణ.. కోర్సు ప్రారంభం ఎప్పుడంటే? - ap skill development latest programs
రాష్ట్ర యువతకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు ఐఎస్బీతో.. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ అకాడమీలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
mou exchanged by ISB, APSSDC
పరిశ్రమల్లో పని చేసేందుకు సిద్ధంగా ఉండటమే కాకుండా.. పరిశ్రమలను స్థాపించే విధంగా ప్రోత్సహిస్తామని ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ బంగారు రాజు తెలిపారు. వారం పదిరోజుల్లో ఈ కోర్సు ప్రారంభమవుతుందని, రాబోయే మూడేళ్లలో లక్ష మంది యువతకు ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతోనే.. ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లూట్ల తెలిపారు.
ఇదీ చదవండి: