ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Monsoon: రాగల 3 రోజుల్లో ఉరుములతో మోస్తరు జల్లులు కురిసే అవకాశం - IMD on southwest monsoon further advanced

IMD on Southwest Monsoon: బంగాళాఖాతంలో నైరుతీ రుతుపవనాలు మరింతగా విస్తరించాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో మూడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు కురిసే అవకాశ ఉందని పేర్కొంది.

IMD on southwest monsoon advanced
IMD on southwest monsoon advanced

By

Published : May 18, 2022, 4:42 AM IST

IMD on Southwest Monsoon: బంగాళాఖాతంలో నైరుతీ రుతుపవనాలు మరింతగా విస్తరించాయి. నైరుతీ రుతుపవనాల ఉత్తర పరిమితి అండమాన్ నుంచి లాంగ్ ఐలాండ్స్ ప్రాంతం వరకూ రుతుపవనాలు విస్తరించినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రాగల 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు తదితర ప్రాంతాలకూ విస్తరిస్తాయని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం సహా పరిసర ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనువుగా వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు తెలియచేసింది. దీని ప్రబావంతో కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

మరోవైపు.. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని చాలా చోట్ల ముందస్తు రుతుపవన జల్లులు పడే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 3 రోజుల్లో మూడు ప్రాంతాల్లోనూ ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు కురిసే అవకాశ ఉందని వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.

ఇదీ చదవండి:ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు దగ్ధం.. ముగ్గురు సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details