దేశంలో కొద్దిరోజులుగా చమురుమంటలు కాల్చేస్తున్నాయి. ఇప్పుడిది బహిరంగ రహస్యం.దాని ప్రభావం పేద, మధ్యతరగతి వర్గాలపై అల్లాడిపోతున్నాయి. వాహనం బయటకు తీయాలంటే భయం వేస్తోంది. ఈ రోజు గడిచేది ఎలా అన్న ఆందోళన వెంటాడుతోంది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం పడని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. ఇదేమి బాదుడు మహప్రభో అంటున్నా.. సెంచరీ కొట్టిన ధరలు మాత్రం దిగి రావడం లేదు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కాస్తంత కనికరించి పెట్రోల్‌పై 5 రూపాయిలు, డీజిల్‌పై 10 రూపాయిలు లెక్కన ఎక్సైజ్ సుంకం తగ్గించింది. తర్వాత కొన్ని రాష్ట్రాలు ఆ బాటలో నడిచాయి. కానీ ఈరోజుకీ ఆ ఊసే ఎత్తని రాష్ట్రాలు ఉన్నాయి. అందులో తెలుగురాష్ట్రాలూ ఉన్నాయి. అన్నింటికంటే ఇబ్బందికరంగా అనిపిస్తోన్న అంశం... దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పెట్రో పోటు అధికంగా ఉండడం.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు
విజయవాడ | ఆంధ్రప్రదేశ్ | 110.03 | 96.14 |
ముంబయి | మహారాష్ట్ర | 109.96 | 94.13 |
హైదరాబాద్ | తెలంగాణ | 108.18 | 94.61 |
జైపుర్ | రాజస్థాన్ | 107.08 | 90.70 |
తిరువనంతపురం | కేరళ | 106.34 | 93.46 |
పట్నా | బిహార్ | 105.87 | 91.08 |
ఈ లెక్కల్లో స్పష్టంగా కనిపిస్తోన్నది ఒక్కటే. పెట్రోల్, డీజిల్ ధరల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానానికి చేరింది. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. పెట్రో ధరల్లో ఇప్పటి వరకు తొలిస్థానంలో నిలిచిన రాజస్థాన్ ఒక మెట్టు దిగిరావడంతో ఏపీ ఇలా టాప్‌లోకి వచ్చి చేరింది. లీటరు పెట్రోలుపై 4 రూపాయలు, డీజిల్‌పై 5 రూపాయల చొప్పున తగ్గిస్తున్నట్లు మంగళ వారం జరిగిన రాజస్థాన్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం జైపుర్‌లో పెట్రోలు లీటరు 107.08 రూపాయలు, డీజిల్ 90.70 రూపాయల చొప్పున లభిస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో ఈ ధరలు వరుసగా 110.03 రూపాయలు, 96.08 రూపాయలు చొప్పున ఉన్నాయి. రాజస్థాన్‌తో పోలిస్తే.. ఏపీలో లీటరుకు పెట్రోలుపై 2 రూపాయల 95పైసలు, డీజిల్‌పై 5 రూపాయల 40పైసలు అధికం.
పెట్రోల్, డీజిల్ రెండు రకాల ఇంధన ధరల్లో ఏపీ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తెలంగాణ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ సవరణల తర్వాత దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోనే పెట్రోలు ధర లీటరు 105రూపాయలు పైబడి ఉంది. డీజిల్ 90 రూపాయలు పైబడిన రాష్ట్రాలు 9 ఉన్నాయి. ఇందుకు కారణం ఆయా రాష్ట్రాల్లో పన్ను తగ్గింపులు చేపట్టకపోవడమే. మహారాష్ట్ర, దిల్లీ, పశ్చిమ్‌బంగ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌పై పన్ను భారాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఈ పన్నుల తగ్గింపు విషయంలో సామాన్యుల నుంచి ఆందోళనలే కాదు. కేంద్ర ప్రభుత్వం - రాష్ట్రాల మధ్య కూడా మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. అయినా... ముఖ్యంగా తెలుగురాష్ట్రాలు మాత్రం పెట్రో పన్నులు తగ్గించేందుకు ముందుకు రాలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో పన్నులు
(రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నవి)
పెట్రోల్ రూ. 29.32
డీజిల్ రూ. 21.41
(దాదాపుగా)
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో పన్నులు
(కేంద్రం విధిస్తున్నవి)
పెట్రోల్ రూ. 22.85