Income on bar applications: రాష్ట్రంలో కొత్త బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి... దరఖాస్తు రుసుముల రూపంలో రూ.100 కోట్లకు పైగానే ఆదాయం లభించనుంది. అందులో ఇప్పటికే రూ.62.50 కోట్లు వచ్చింది. మిగతా మొత్తం ఒకటి, రెండు రోజుల్లోనే సమకూరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 840 కొత్త బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్‌శాఖ తాజాగా ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు బుధవారం సాయంత్రంతో గడువు ముగిసింది.
Bars income: బార్ల ఏర్పాటుకు.. భారీ దరఖాస్తులు.. ఆదాయం ఎంతంటే..? - ఏపీలో బార్ల దరఖాస్తుల వెల్లువ
Income on bar applications: రాష్ట్రంలో 840 బార్ల ఏర్పాటుకు ఏకంగా 1672 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.వందకోట్లకు పైగానే లభించనుంది. సగటున ఒక్కో దరఖాస్తుకు రుసుము రూ.7.50 లక్షలు అనుకున్నా... రూ.122 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.
123 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో బార్ల ఏర్పాటు కోసం 1672 దరఖాస్తులు వచ్చాయి. ఆయా ప్రాంతాల జనాభా ఆధారంగా రూ.5 లక్షలు, రూ.7.50 లక్షలు, రూ.10 లక్షల చొప్పున 3 కేటగిరీల్లో బార్ల దరఖాస్తు రుసుమును నిర్ణయించారు. సగటున ఒక్కో దరఖాస్తుకు రుసుము రూ.7.50 లక్షలు అనుకున్నా ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తుల రుసుము ద్వారా రూ.122 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కొంతమంది రుసుము చెల్లించకుండా మధ్యలోనే ఉపసంహరించుకున్నా సరే తక్కువలో తక్కువ రూ.100 కోట్ల మేర ఆదాయమైతే వస్తుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇవీ చదవండి: