Hyderabad Metro: అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలన్న ఆర్మీ ఉద్యోగార్ధుల డిమాండ్, తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు మళ్లీ సేవలు ప్రారంభించాయి. ఉదయం సికింద్రాబాద్‌లో ఆందోళన దృష్ట్యా హైదరాబాద్ మెట్రో అప్రమత్తమై అన్ని సర్వీసులను నిలిపివేసింది. సాయంత్రం పరిస్థితి అదుపులోకి రావడంతో.. 6.35 నిమిషాలకు మెట్రో రైళ్లు మళ్లీ పట్టాలపై పరుగులు తీశాయి.
తగ్గిన ఉద్రిక్తత.. పట్టాలపై పరుగులు తీస్తున్న మెట్రో రైళ్లు - హైదరాబాద్ మెట్రో తాాజా వార్తలు
Hyderabad Metro: తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఆగిన మెట్రో రైళ్లు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. అగ్నిపథ్‌పై ఉద్రిక్తతల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మెట్రో రైళ్లను నిలిపివేసిన అధికారులు వాటిని సాయంత్రం 6.35కు తిరిగి ప్రారంభించారు.
ఉదయం అకస్మాత్తుగా మెట్రో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం నగరవాసులకు చుక్కలు చూపించింది. ఆఫీసులు, కళాశాలలు, వివిధ పనుల గురించి బయటకు వచ్చిన వారంతా మెట్రో సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు ఎంఎంటీఎస్ సేవలు కూడా నిలిచిపోవడంతో ఆర్టీసీ బస్సులు నిండుగా కనిపించాయి. క్యాబ్‌లు, ఆటోలకు బాగా డిమాండ్ కనిపించింది. ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు చాలాసమయం వేచి చూడాల్సి వచ్చిందని నగరవాసులు వాపోయారు. ఎట్టకేలకు మెట్రో సేవలు తిరిగి ప్రారంభం కావడంతో... ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: