ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Fire Accident in Military Club: సికింద్రాబాద్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తినష్టం! - Club Fire Accident news

Fire Accident in Secunderabad Club: అతిపురాతనమైన సికింద్రాబాద్ క్లబ్​లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసిపడిన మంటలను నాలుగు గంటలపాటు శ్రమించి.. ఏడు అగ్నిమాపక యంత్రాలతో అదుపులోకి తెచ్చారు.

fire accident
fire accident

By

Published : Jan 16, 2022, 7:51 AM IST

Updated : Jan 16, 2022, 1:13 PM IST

Fire Accident in Secunderabad Club: సికింద్రాబాద్​ క్లబ్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు.. 4 గంటల పాటు సిబ్బంది శ్రమించారు. ఏడు అగ్నిమాపక యంత్రాలతో.. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

శనివారం సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్​ క్లబ్​ను మూసివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఎగిసిపడిన అగ్నికీలల్లో క్లబ్​ పూర్తిగా దగ్ధమైంది. క్లబ్​లో అగ్నిప్రమాద కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉత్తర మండల డీసీపీ చందనాదీప్తీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

సికింద్రాబాద్​ క్లబ్​లో భారీ అగ్నిప్రమాదం

వారసత్వ సంపద..

Fire Accident in Secunderabad: 1878లో బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్​ నిర్మించారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్లబ్​లో.. 5 వేల మందికి పైగా సభ్యత్వం ఉంది. క్లబ్​లో 250 మంది ఉద్యోగులు, మరో 100 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. సికింద్రాబాద్​ క్లబ్​ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి.. 2017లో పోస్టల్​ కవర్​ విడుదల చేశారు.

Last Updated : Jan 16, 2022, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details