ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆరోపణలకు బలమైన ఆధారాలు లేకుంటే చర్యలు తీసుకోలేం' - హైకర్ట్​ తాజా వార్తలు

పేరు, సంతకం, ప్రమాణపత్రం, ఆరోపణలకు బలం చేకూర్చే వివరాలు లేకుండా అందుకున్న ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేమని హైకోర్ట్​ రిజిస్ట్రార్​ సునీత వివరణ ఇచ్చారు. కానీ, వ్యవస్థ ప్రయోజన నిమిత్తం ఏ ఫిర్యాదుపైన అయినా... ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారం మేరకు ప్రాథమిక విచారణకు ఆదేశించవచ్చని తెలిపారు.

highcourt registrar sunita on dismiss petition
హైకోర్టు రిజిస్ట్రార్​​ సునీత

By

Published : Oct 21, 2020, 8:33 AM IST

దిగువస్థాయి న్యాయ వ్యవస్థలోని సభ్యుల సిబ్బందిపై చేసే ఫిర్యాదుతో పాటు ప్రమాణపత్రం, ఆరోపణలకు బలం చేకూరే ఆధారాలు సమర్పించకపోతే ఆ ఫిర్యాదును స్వీకరించలేమని హైకోర్టు రిజిస్ట్రార్​​ సునీత తెలిపారు. దానిపై చర్యలు తీసుకోలేమని ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో ఉన్న నిబంధనలకు అదనంగా ఈ మేరకు మార్గదర్శకాలు ఇచ్చారు. పేరు, సంతకం, ప్రమాణపత్రం, ఆరోపణలకు బలం చేకూర్చే వివరాలు లేకుండా అందుకున్న ఫిర్యాదుపై ఎలాంటి చర్యలుండవన్నారు. అయినప్పటికీ వ్యవస్థ ప్రయోజన నిమిత్తం ఏ ఫిర్యాదుపైన అయినా... ప్రాథమిక విచారణకు ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారం మేరకు ఆదేశించవచ్చన్నారు. విచారణ అనంతరం అది ఇబ్బందులకు గురిచేసే ఫిర్యాదని తేలినా.. ఆరోపణలను నిరూపించలేకపోయినా ఖర్చులు చెల్లించాలని ఫిర్యాదుదారుని ఆదేశించే అవకాశం ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details