ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ - lawyers

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి బదిలీపై ఆ రాష్ట్ర న్యాయవాదులు చేస్తోన్న నిరసనకు మద్దతు తెలుపుతున్నట్టు.. ఏపీ హైకోర్టు న్యాయవాదులు తెలిపారు. రెండ్రోజులు పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ

By

Published : Sep 5, 2019, 5:35 PM IST

హైకోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ

రాష్ట్ర హైకోర్టు న్యాయవాదులు రెండ్రోజుల పాటు (నేడు, రేపు) విధులను బహిష్కరించారు. తెలంగాణ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ను పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. న్యాయమూర్తి బదిలీపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. వారికి మద్దతు తెలుపుతున్నట్లు ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రవికుమార్‌ తెలిపారు. గతంలో ఏపీ హైకోర్టు నుంచి బదిలీ చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ భట్‌ను తిరిగి ఏపీకి బదిలీచేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై త్వరలో సుప్రీంకోర్టు కొలిజియంకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details