తెలంగాణ ఆర్టీసీలో రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. మంత్రిమండలి నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ఏజీ... సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించారు. జీవో వచ్చిన తర్వాతే కేబినెట్ నిర్ణయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. స్పందించిన కోర్టు.. మంత్రిమండలి నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం తమకు తెలియకపోతే ఎలా వాదిస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును అడిగారు. రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై మంత్రిమండలి ఏ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుందని పిటిషనర్ ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ఆర్టీసీపై.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న! - highcourt
తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్ల ప్రైవేటీకరణపై మంత్రి మండలి నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
tsrtc