ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ గోరంట్ల వీడియో కేసులో చింతకాయల విజయ్ పై నమోదైన కేసుపై హైకోర్టు స్టే - తనకు సంబంధం లేదన్న చింతకాయల విజయ్

ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నవీడియో కేసులో సీఐడీ తనను నిందితుడిగా పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ ఐటీడీపీ నేత చింతకాయల విజయ్ కుమార్ వేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని, కేసును కొట్టివేయాలని ..కోర్టును అభ్యర్ధించారు. ఇరు వాదనలను విన్న కోర్టు.. తదుపరి చర్యలపై స్టే విధించింది.

MP
MP

By

Published : Sep 15, 2022, 10:44 PM IST


గోరంట్ల మాధవ్‌ కేసులో C.I.D తనను నిందితుడిగా పేర్కొనడాన్ని I.T.D.P నేత చింతకాయల విజయ్‌కుమార్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ కేసును కొట్టివేయాలని స్క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. చింతకాయల విజయ్‌ తరపున న్యాయవాది వి.వి. సతీష్‌ వాదనలు వినిపించారు . యుకే నెంబర్ నుంచి ఐటీడీపీ ఈ వీడియో అప్ లోడ్ చేసిందని సీఐడీ పేర్కొందని.. న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఐటీడీపీ గ్రూపుకు పిటిషనర్ అడ్మిన్ కాదన్నారు. ఆ వీడియోకు పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్‌కు వర్తించవన్నారు. చింతకాయల విజయ్‌కుమార్‌పై నమోదు చేసిన కేసును కొట్టేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వాదనలు విన్న కోర్టు కేసులో తదనంతర చర్యలపై స్టే విధించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details